Namaste NRI

నా సామిరంగ నుంచి సీసా మూత ఇప్పు సాంగ్ రిలీజ్

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం నా సామిరంగ.  ఆషికా రంగనాథ్‌ కథానాయిక.  విజయ్‌ బన్నీ దర్శకుడు. అల్ల‌రి న‌రేష్, రాజ్ త‌రుణ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 14న‌ ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌తో పాటు పాట‌లకు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి పార్టీ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

సీసా మూత ఇప్పు అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేశారు. పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటే ప్రేమ బండి చలో అంటే, రైస్ మిల్లు నెల జీతం రయి రయి మని పెరిగిందంటే ఫేవరేట్ హీరో బొమ్మ హౌస్ ఫుల్ పడిందంటే, ఇండియా కప్పు కొట్టుకొస్తే ఇల్లాలే రాజీకొస్తే, పక్కింటోడికి లాస్ వస్తే, వాడిని ఓదార్చే ఛాన్స్ వస్తే ఎం సెయ్యాలి సెప్పు సీసా మూత ఇప్పు ఎం సెయ్యాలి సెప్పు సీసా మూత ఇప్పు అంటూ ఫుల్ ఎనర్జీటిక్‌ గా ఈ పాట సాగింది. ఈ పాట‌ను ఆస్కార్ అవార్డు విన్న‌ర్ చంద్ర‌బోస్ రాయ‌గా, మల్లికార్జున్, రేవంత్, సాయి చరణ్, లోకేష్, హైమత్. అరుణ్ కౌండియా క‌లిసి అల‌పించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events