Namaste NRI

నానే వరువేన్ ఫస్ట్ లుక్ విడుదల

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ కథానాయకుడిగా సెల్వ రాఘవన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం నానే వరువేన్‌. ధనుష్‌ సరసన హీరోయిన్‌ గా ఇందుజా రవిచంద్రన్‌ ని ఎంపిక చేశారని సమాచారం. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో ధనుష్‌ ఓ కుర్చీలో స్టైల్‌గా కూర్చొని కనిపించారు. ఇందులో ధనుష్‌ లెదర్‌ జాకెట్‌, తల పై టోపీ పెట్టుకని కౌ బౌయ్‌ లుక్‌ లో కనిపిస్తున్నాడు. అంతేకాదు నోట్లో సిగార్‌ భుజాన ఓ ఆయుధం పట్టుకొని  వేటకు సిద్ధమైన హంటర్‌ లా ఉన్నాడు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ లో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తారని, తొలిసారి అటు హీరోగాను ఇటు విలన్‌ గానూ నటించబోతున్నాడని కోవీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆసక్తికరమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ధనుష్‌, స్టైయిట్‌ తెలుగు మూవీతో టాలీవుడ్‌ లో అడుగుపెడుతున్నాడు.  వి.క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events