మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అందమైన అమ్మాయిల్ని ఎరగా వేసి తన పనులు నెరవేర్చుకున్న అమెరిరికా వ్యాపారి భాగోతం బయటపడిరది. సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ ప్రముఖ అటార్నీ అలన్ డెర్షోవిజ్, బ్రిటన్ రాణి కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ వంటి ప్రముఖులు ఈ కుంభకోణంలో పాలుపంచుకొన్నట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ప్రముఖ పైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ స్నేహితురాలు గిస్లెయిన్ మాక్స్‌వెల్ ఇదే కేసులో అరెస్టయ్యారు.
14 ఏండ్ల బాలికలను సంపన్నుల వద్దకు పంపి, పనులు చేయించుకునేందుకు జెఫ్రీకి సహకరించారని ఐదు కేసుల్లో ఆమెను దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో ఆమెకు దాదాపు 65 ఏండ్ల పాటు జైలు శిక్ష పడనుంది. అయితే తక్కువ శిక్ష పడేందుకు ఈ కేసుకు సంబంధమున్న ప్రముఖుల పేర్లను బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కాగా 2019లో అరెస్టయిన జెఫ్రీ ఎప్‌స్టీన్ అదే ఏడాది జైలులోని అనుమానాస్పదంగా మృతి చెందాడు. కాగా, జెఫ్రీకి నేరాల్లో సహకరించిన స్నేహితురాలు గిలెన్ మ్యాక్స్‌వెల్‌పై తాజాగా ఐదు కేసుల్లో దోషిగా నిరూపితమయ్యారు. 1994`2004 వరకు బాలికలను ఎపిస్టన్ వద్దకు పంపేందుకు సహకరించినట్లు తేలింది. దాదాపు 30 మిలియన్ డాలర్లను ఆమె సంపాదించినట్లు గుర్తించారు. ఈ కేసుల్లో ఆమెకు 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.