దుబాయి రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ సంచలన ప్రకటన చేశారు. సిరియాలో భూకంపబాధితుల సహాయార్థం 13.6 మిలియన్ డాలర్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజు సేవా కార్యక్రమాలను పర్యవేక్షించే మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ గ్లోబల్ ఇనీషియేటివ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నిధులను భూకంపబాధితుల సహాయార్థం వెచ్చించనున్నట్టు తెలిసిందే.














