Skip to main content

Namaste NRI

ఇటలీ మాజీ ప్రధాని సంచలన నిర్ణయం.. ఆమెకు రూ.900 కోట్ల ఆస్తి గిఫ్ట్‌

 ఇట‌లీ మాజీ ప్ర‌ధాని, బిలియ‌నీర్‌ సిల్వియో బెర్లుస్కోనీ  ఇటీవ‌ల 86 ఏళ్ల వ‌య‌సులో ప్రాణాలు విడిచిన విష‌యం తెలిసిందే. మూడుసార్లు ప్ర‌ధానిగా చేసిన ఆయ‌న త‌న వీలునామాలో 33 ఏళ్ల గ‌ర్ల్‌ఫ్రెండ్ మార్టా ఫాసినాకు 100 మిలియ‌న్ల యూరోలు కేటాయిస్తున్న‌ట్లు రాశారు. ఫాసినాను చట్టప్రకారం వివాహం చేసుకోనప్పటికీ మృత్యుశయ్యపై ఉన్న సమయంలో ఆమెను తన భార్యగా బెర్లుస్కోని ప్రస్తావించినట్టు సమాచారం . 2018 సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇటలీ పార్లమెంట్‌ దిగువ సభ సభ్యురాలిగా మార్టా కొనసాగుతున్నారు. బెర్లుస్కోని తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 1994లో ఫోర్జా ఇటాలియా అనే పార్టీని పెట్టారు.

సదరు పార్టీలో సభ్యురాలిగా మార్టా ఉన్నారు. ఇరువురి మధ్య బంధం 2020 మార్చిలో పెనవేసుకుంది. ఇటలీ మాజీ ప్రధాని మొత్తం ఆస్తి విలువ 6 బిలియన్‌ యూరోలపై మాటే. సిల్వియో బెర్లుస్కోని రాసిన విల్లును ఆయన ఐదుగురు సంతానం, ఇతర సాక్షుల సమక్షంలో చదివి వినిపించారు. ఆ విల్లులో నా దగ్గరున్న నగదు నిల్వలను నా సంతానం మరినా, పేర్‌ సిల్వియోలకు సమానంగా పంచుతున్నాను. మిగిలిన ఆస్తిని నా ఐదుగురు సంతానం మరినా, పేర్‌ సిల్వియో, బార్బారా, ఎల్యోనోరా, లుయిగిలకు సమభాగాలుగా అప్పగిస్తున్నాను  అని ఇటలీ మాజీ ప్రధాని రాశారు. ఇట‌లీలో అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా చేసిన రికార్డు ఆయ‌న పేరిట ఉంది. కానీ బుంగా బుంగా పార్టీల‌తో ఆయ‌న వివాదాస్ప‌ద నేత‌గా మారారు. ఎన్నో కుంభ‌కోణాల్లో పాత్ర ఉన్న‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events