నవీన్‌చంద్ర నటిస్తున్న తాజా చిత్రం ఇన్‌స్పెక్టర్ రిషి. సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాళ్, మాలినీ జీవ రత్నం, కుమార్ వేల్ కీలకపాత్రధారులు. నందిని జేఎస్ దర్శకత్వంలో సుఖ్‌దేవ్ లహరి నిర్మిస్తు న్నారు. తీన్ కాడు అనే ప్రాంతంలోని అడవిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ ప్రాంతంలో తిరిగే రాట్చి అనే దెయ్యమే ఈ హత్యలకు కారణమని అక్కడి ప్రజలు చెబుతుంటారు. సీబీసీఐడీకి ప్రభుత్వం కేసు అప్పగిస్తుం ది. ఈ హత్యలకు కారణాలు తెలుసుకునేందుకు ఆ ఊరికి కొత్త ఇన్‌స్పెక్టర్ రిషి వస్తాడు. ఊరుజనం మాటలు నమ్మని రిషి, సైంటిఫిక్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో రిషికి, అతని టీమ్‌కీ షాక్ అయ్యే విషయా లు తెలుస్తుంటాయి. ఈ హత్యలకు కారణం దెయ్యమే అయితే, పరిష్కారం పోలీసులు ఎలా కనుక్కున్నారు? అనే ప్రశ్నకు సమధానంగా రూపొందుతోన్న హారర్ క్రైమ్ వెబ్‌సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ తమిళ్ ఒరిజినల్‌లో ఈ నెల 29న స్ట్రీమింగ్ కానుంది.