ఆఫ్ఘనిస్థాన్ నుంచి సైన్యం ఉపసంహరణకు నిర్దేశించిన గడువు పొడిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు తాలిబన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒప్పందం ప్రకారం తన బలగాలను అమెరికా పూర్తిగా వెనక్కి రప్పించిన తర్వాతే తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తి కానంత వరకు తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్ నుంచి సైన్యం ఉపసంహరణకు నిర్దేశించిన ఆగస్టు 31 గడువును మరింత పొడిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు తాలిబన్లు హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గతంలో చెప్పిన ఆగస్ట్ 31 నాటికి ఆ దేశ బలగాల ఉపసంహరణ పూర్తి కావాలని డిమాండ్ చేశారు. ఆప్ఘనిస్థాన్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న సైన్యాన్ని పూర్తిగా వెనక్కి రప్పించేందుకు ఆగస్ట్ 31 కంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందన్న బైడెన్ వ్యాఖ్యల నేపథ్యంలో తాలిబన్లు తాజాగా ఈ హెచ్చరిక చేశారు.