Namaste NRI

శభాష్‌ మిథు విడుదల తేదీ ఖరారు

ప్రముఖ హీరోయిన్‌ తాప్పీ నటించిన భారీ స్పోర్ట్స్‌ డ్రామా మూవీ శభాష్‌ మిథు ఇపుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్‌ ఉమెన్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ గురించి ఈ చిత్రం రాబోతోంది.  ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీ నటించారు. క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ సాధించిన విజయాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబధించిన కొన్ని అంశాలను ఈ చిత్రంలో ప్రస్తావించినట్లుగా చిత్రయూనిట్‌  పేర్కొంది. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు. జులై 17న విడుదల చేయనున్నట్టు పేర్కొంటూ ఈ మేరకు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, కొలోస్పియం మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అమిత్‌  త్రివేది సంగీతం అందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events