Namaste NRI

షారుఖ్ ఖాన్.. డంకీ టీజ‌ర్ వ‌చ్చేసింది

షారుఖ్‌ఖాన్ న‌టిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డంకీ.  రాజ్‌కుమార్ హిరానీ  ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాప్సీ క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంది ఈ మూవీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క అప్‌డేట్ రాక‌పోవ‌డం విశేషం. ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ పుట్టినరోజు ఈ సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి దేశాలకు ఇల్లీగల్‌గా వెళ్లాలనుకునేవారు ఎలాంటి కష్టాలని ఫేస్ చేసారు అనేదే డంకీ కథ. ఇక ఇండియా నుంచి ఇంగ్లాండ్‌కు చట్టవిరుద్ధంగా వెళ్లే షారుఖ్ అండ్ అతని గ్యాంగ్‌కు ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది డంకీ క‌థ అని టీజ‌ర్ చూస్తే అర్థమవుతుంది. రాజ్ కుమార్ హిరానీ ముందు మూవీస్ లానే డంకీలో కూడా కామెడీ ఉంటుంద‌ని తెలుస్తుంది. హార్డీ పాత్ర‌లో షారుఖ్ న‌టిస్తుండ‌గా, మనుగా తాప్సి న‌టిస్తుంది.

డ్రామా, రొమాన్స్ జాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో హిరానీ, గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events