Namaste NRI

శాకుంతలం ట్రైలర్ విడుదల

 సమంత టైటిల్ రోల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక ప్రేమకావ్యం శాకుంతలం. హైదరాబాద్‌లోని పివిఆర్ ఆర్.కె. సినీప్లెక్స్‌లో ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.  ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ గుణశేఖర్ మీదున్న గౌరవంతో ఓపిక లేపోయినా నా బలాన్నంతా కూడదీసుకొని ఇక్కడకు వచ్చాను. గుణశేఖర్ ఈ సినిమాను ప్రాణం పెట్టి తీశారు. శాకుంతలం చూశాక మన ఊహకు మించిన అద్భుతమైన చిత్రమనే భావన కలిగింది. ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఒక్కటి మాత్రం మారలేదు. సినిమాను నేను ఎంతగా ప్రేమిస్తానో..సినిమా కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నది. శాకుంతలం చిత్రంతో ఆ ప్రేమ మరింత పెరుగుతుందనే నమ్మకం ఉంది అని చెప్పింది.

దిల్‌రాజు మాట్లాడుతూ గుణశేఖర్ మూడేళ్ల శ్రమకు నిదర్శనం శాకుంతలం. సమంత అద్భుతంగా నటించింది. ఇది ఒరిజినల్ పాన్ ఇండియా సినిమా. ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నాం అన్నారు. గుణశేఖర్  మాట్లాడుతూ  ఈ కథలో హీరో దేవ్మోహన్ అయితే..సినిమాకు సమంత హీరో. దిల్రాజు అండగా ఉండటం వల్ల ఈ సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించగలిగాను. మన పురాణాల్లోని అద్భుతమైన కథల్ని నేటి తరానికి చెప్పాలని నా కుమార్తె నీలిమ అనుకుంది. ఈ కథకు సమంత అయితేనే బాగుంటుందని చెప్పింది. ఒక్క హీరోయిన్ను నమ్మి దిల్రాజు సినిమా కోసం ఇన్ని కోట్లు పెట్టినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని  తెలిపారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress