నరసింహనంది దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై రూపొందిస్తున్న సిగ్గు చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జేడీ లక్ష్మీనారాయణ క్లాప్‌నివ్వగా, కె.విజయేంద్రప్రసాద్ కెమెరా స్విఛాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు నరసింహనంది చిత్ర విశేషాలు తెలియజేస్తూ చలంగారి సుశీల నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్నది. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తాం అన్నారు. సామాజిక స్పృహను రేకెత్తించే సినిమా ఇదని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు. జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సామాజిక స్పృహ కలిగిన సినిమాలు తీయాలని సమాజాన్ని పాడు చేసే సినిమాలు తీయకూడదు అని నేను క్లాప్ కొట్టాను. చిత్ర బృందం మంచి సినిమా తీస్తుందని నమ్ముతున్నా అన్నారు. రామ సత్యనారాయణ మాట్లాడుతూ నేను చిత్ర పరిశ్రమకి వచ్చి కచ్చితంగా 20 సంవత్సరాలు పూర్తయింది. మొదటి నుంచి నన్ను అభిమానించి అక్కున చేర్చుకున్న వ్యక్తి కళ్యాణ్ గారు. ఆయన సపోర్ట్‌తో ముందుకెళ్తున్నాను అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అబ్బూరి ఉష, సంగీతం: సుక్కు, రచన-దర్శకత్వం: నరసింహనంది.
