అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్)లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీదే మెజారిటి. అయినప్పటికీ స్పీకర్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నెగ్గలేకపోయారు. తొలిరోజు సభాపతి (స్పీకర్) ఎన్నిక నిర్వహించిన స్పీకర్‌ను ఎన్నుకోలేకపోయారు రిపబ్లికను. ఈ క్రమంలో ఘాటుగా స్పందించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. .ప్రతినిధుల సభ స్పీకర్‌ను ఎన్నికోలేకపోయిన రిపబ్లికన్ల తీరు సిగ్గు చేటుగా పేర్కొన్నారు. యావత్ ప్రపంచం మొత్తం మనన్ని చూస్తోందని అన్నారు. వారు ప్రవరిస్తున్న తీరును చూస్తే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. మనం కలిసి పని చేయగలమా అనే సందేహంలో ఉన్నారు అని పేర్కొన్నారు.