Namaste NRI

షణ్ముఖ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం షణ్ముఖ.  అవికాగోర్‌ కథానాయిక. తులసీరామ్‌ సాప్పని, రమేశ్‌ యాదవ్‌లతో కలిసి షణ్మగం సాప్పని స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు. పోలీస్‌ యూనిఫామ్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఆదిని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ఆయన వెనుక సుబ్రహ్మణ్యస్వామి కనిపిస్తుండటం ఈ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటివరకూ ఎవరూ టచ్‌ చేయని అద్భుతమైన పాయింట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నామని, పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి పాత్ర హైలైట్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పాడు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress