Namaste NRI

అవికాగోర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా షణ్ముఖ ఫస్ట్ లుక్‌ విడుదల

ఆది సాయికుమార్‌, అవికాగోర్‌ జంటగా నటిస్తున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ షణ్ముఖ. షణ్ముగం సాప్పని దర్శకత్వం. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. కథానాయిక అవికాగోర్‌ పుట్టినరోజుని పురస్కరించుకొని ఆమె ఫస్ట్  లుక్‌ని రివీల్‌ చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని వినూత్న కథాంశమిది. గ్రాఫిక్స్‌ ప్రధానంగా విజువల్‌ వండర్‌లా ఉంటుంది. అవికాగోర్‌ సర అనే ధైర్యవంతురాలైన అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. ఆమె చేసే సాహసాలు స్ఫూర్తివంతంగా అనిపిస్తాయి. హీరోకు తోడుగా అతని లక్ష్యసాధనకు సహాయం చేసే అమ్మాయిగా కథాగమనంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. ఆది సాయికుమార్‌ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచే చిత్రమవుతుంది అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events