టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. జూన్ 3న శర్వానంద్-రక్షితారెడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శర్వానంద్ సతీమణి రక్షితారెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రెండు రోజులపాటు జరిగిన శర్వానంద్ పెళ్లి వేడుకకు టాలీవుడ్ యాక్టర్లు రాంచరణ్, సిద్దార్థ్, అదితీరావు హైదరీతోపాటు ఇతర నటీనటులు, సినీ ప్రముఖులు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు.
కాగా శర్వానంద్ ఫ్యామిలీ జూన్ 9న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రిసెప్షన్‌కు రావాలని సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందించారు శర్వానంద్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో శర్వానంద్ కొద్దిసేపు ముచ్చటించారు.