Skip to main content

Namaste NRI

శర్వానంద్‌ నారీ నారీ నడుమ మురారి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ 

హీరో శర్వానంద్‌ నటిస్తున్న తాజా చిత్రానికి నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం.  ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌, సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను అగ్ర నటులు బాలకృష్ణ, రామ్‌చరణ్‌ విడుదల చేశారు. ఇద్దరు భామలు అరుస్తుంటే.. శర్వానంద్‌ మధ్యలో నలిగిపోతూ చెవులు మూసుకోవడం ఫస్ట్ లుక్‌లో చూడొచ్చు. ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది.  ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. శర్వానంద్‌ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నాం అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌, కథ: భాను భోగవరపు, సంగీతం: విశాల్‌చంద్రశేఖర్‌, నిర్మాణ సంస్థలు: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌ అబ్బరాజు.

Social Share Spread Message

Latest News