శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. సంయుక్త మీనన్, సాక్షి వైద్య కథానాయికలు. రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ గమనిస్తే గౌతమ్ (శర్వా) బీటెక్ ఆర్కిటెక్. తన గాళ్‌ఫ్రెండ్ (సాక్షి వైద్య) తో సాఫీగా సాగుతున్న అతడి జీవితంలోకి ఒక్కసారిగా అతని ఎక్స్ గాళ్‌ఫ్రెండ్(సంయుక్త) రీ ఎంట్రీ ఇచ్చింది. గందరగోళం మొదలైంది. గౌతమ్ తన ప్రెజెంట్, పాస్ట్ మధ్య నలిగిపోవడం ట్రైలర్‌లో ఆసక్తిని రేకెత్తించింది.

శర్వా రెండు భిన్నమైన కాలాల్లో, రెండు ప్రేమకథల్లో, రెండు రకాల ైస్టెలిష్ లుక్స్‌తో కనిపించారు. సంయుక్త, సాక్షి తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. నరేష్, సత్య, సునీల్, సుదర్శన్, సంపత్‌రాజ్‌లు ట్రైలర్‌లో సందడి చేశారు. మొత్తానికీ ఆడియన్స్‌ని నవ్వుల్లో ముంచే సినిమా ఇదని ట్రైలర్ చెబుతున్నది. శ్రీవిష్ణు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కథ: భాను భోగవరపు, మాటలు: నందు సవిరిగాన, కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్.















