Namaste NRI

తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఫౌండేషన్‌ నూతన కార్యవర్గం కొలువుదీరింది. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి, కార్యదర్శిగా విద్యాధర్‌ గారపాటి, కోశాధికారిగా వినయ్‌ మద్దినేని ఎన్నికయ్యారు. చైర్మన్‌గా ఎన్నికైన శశికాంత్‌ వల్లేపల్లి సుదీర్ఘకాలంగా ఫౌండేషన్‌లో సేవలందిస్తున్నారు. కాంత్‌ ఫౌండేషన్‌ స్థాపించి భారీగా విరాళాలు అందించారు. గతంలో ఫౌండేషన్‌ కోశాధికారిగా, కార్యదర్శిగా, బోస్టన్‌ తెలుగు అసోసియేషన్‌ బోర్డు చైర్మన్‌గా కూడా పని చేశారు.  తానా ఫౌండేషన్‌ కార్యదర్శిగా ఎన్నికైన విద్యాధర్‌ గారపాటి.. మూవర్స్‌ డాట్‌ కామ్‌ అధినేతగా అందరికీ సుపరిచితులు. విద్యాధర్‌ గతంలో తానా పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా, న్యూజెర్సీ,  న్యూయార్క్‌ ఏరియా రీజినల్‌  కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు.  తానా ఫౌండేషన్‌ కోశాధికారిగా ఎన్నికైన వినయ్‌ మద్దినేని తానా సౌత్‌ ఈస్ట్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ మెట్రో అట్లాంటా (తామా) అధ్యక్షుడిగా సేవలందించారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events