మెగాస్టార్ చిరంజీవి , అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతన్న చిత్రం మన శంకర్ వరప్రాద్ గారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రానున్న సంక్రాంతికి థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మీసాల పిల్ల అనే పాట అంచనాలను మించి విజయం సాధించి సినిమా హైప్స్ మరింతగా పెంచింది.

ఈ నేపథ్యంలో తాజాగా శశిరేఖ అంటూ సాగే మరో లవ్ మెలోడీ పాటను విడుదల చేశారు. బీమ్స్ సిసిరిలియో సంగీత దర్శకత్వంలో అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యం అందించగా బీమ్స్, మధు ప్రియ ఆలపించారు. శశిరేఖా ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.. ఓ ప్రసాదు మెహామాటాలు లేకుండా చెప్పేసేయ్ ఏమీ కాదు అంటూ సాగిన ఈ పాటను చిరంజీవి, నయనతారలపై చిత్రీకరించారు. భాను మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల.
















