Namaste NRI

వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా శత చండీ హోమం

సింగపూర్ చైనాటౌన్‌లో వేంచేసి ఉన్న శ్రీ మారియమ్మన్ ఆలయంలో మహా కుంభాభిషేక వేడుక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా సింగ‌పూర్‌లోని ఆర్య‌వైశ్య కుటుంబాలు అత్యంత శ్ర‌ద్ధ‌, భ‌క్తి పార‌వ‌శ్యంతో మండల పూజలు, శత చండీ హోమం, తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వ‌హించారు. వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు తొమ్మిది నెలలుగా ప్రతి రోజూ విష్ణు సహస్ర నామ పారాయణ, లలితా లక్షార్చన, సామూహిక భజన‌లు జ‌రిగాయి. శ్రీ వాసవి మాత అనుగ్రహంతో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఆధ్యాత్మిక, ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి.

ఈ  దేవాలయంలో గ‌తంలో ఐదు సార్లు మాత్ర‌మే మ‌హా కుంభాభిషేక మ‌హోత్స‌వం జ‌రిగింద‌ని చ‌రిత్ర చెబుతున్న‌ది. గ‌త నెల 12న మొద‌లైన మ‌హాకుంభాభిషేకం, 40 రోజుల మండ‌ల పూజ‌లతోపాటు శ‌త చండీహోమంతో సుసంప‌న్న‌మైంది. వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ సెక్ర‌ట‌రీ న‌రేంద్ర కుమార్ నారంశెట్టి మ‌హాకుంభాభిషేకానికి రూపొందించిన తొమ్మిది నెల‌ల కార్య‌క్ర‌మాల‌ను క్ల‌బ్ సీనియ‌ర్ స‌భ్యుడు ముక్కా కిశోర్‌కు అప్ప‌గించారు.

క్ల‌బ్ వ్య‌వ‌స్థాప‌క గౌర‌వాధ్య‌క్షులు వెంక‌ట్ నాగ‌రాజు కైలా, గౌర‌వ కార్య‌ద‌ర్శి మంచికంటి శ్రీ‌ధ‌ర్ మాట్లాడారు. ఎంతో అరుదైన మహా కుంభాభిషేకం నిర్వ‌హ‌ణ ఒక సదవకాశం అని వ‌క్త‌లు పేర్కొన్నారు. వాసవి క్లబ్ దశమ వార్షికోత్సవ వేళ ఈ మ‌హాకుంభాభిషేకం జ‌రుగ‌డం కాకతాళీయం మాత్రమే కాదు, ఆర్యవైశ్యులపై శ్రీ వాసవి అమ్మ వారి కృపకు నిదర్శనం అని అన్నారు. తొమ్మిది నెల‌ల పాటు నిరంత‌రాయంగా సింగ‌పూర్ వంటి దూర ప్రాంతాల్లో భార‌తీయ హైంద‌వ సంస్కృతిని యువ‌త‌కు, పిల్ల‌ల‌కు ప‌రిచయం చేసే మ‌హా కుంభాభిషేకం విజ‌య‌వంతంగా నిర్వ‌హించుకోవ‌డం ఆర్య‌వైశ్యుల సంఘీభావానికి నిద‌ర్శ‌నం అని క్లబ్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గట్లూరు, క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి అన్నారు.

వాసవి క్లబ్ సీనియర్ సభ్యులు మురళి కృష్ణ పబ్బతి, రాజశేఖర్ గుప్త, మకేష్ భూపతి, నూతన సభ్యులు సుమన్ రాయల, ఆనంద్ గందె, వినయ్, కిషోర్ శెట్టి, సరిత, ఫణీష్, వాసవి మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాద భలం లేకపోతే ఈ కార్యక్రమం నిరాటంకంగా జ‌రుపుకోవ‌డం అసాధ్యం అని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు  వాసవి క్లబ్ స‌భ్యులు విజయ్ సారధి పాడి, శ్రీకాంత్ నూతిగట్టు, సరితా దేవి, దివ్య గాజులపల్లి, భార్గవి, హేమ కిషోర్, రాజశేఖర్ గుప్త, శ్రీవాణి, చైతన్య పురుషోత్తం, వాసవి ఫణీష్, హేమ కిషోర్ స‌హ‌కారం అందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress