Namaste NRI

ఆమె.. తుఫానులో ప్రశాంతత

బాలీవుడ్ కథానాయిక జాన్వీ కపూర్‌  తెలుగు తెరకు పరిచయం కాబోతున్నది.  తెలుగు సినీరంగం అంటే ప్రత్యేకమైన అభిమానం. తన దక్షిణాది అరంగేట్రం తెలుగు ఇండస్ట్రీ నుంచే ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పిందీ భామ. ఆమె కోరుకున్న విధంగానే ఎన్టీఆర్ 30వ చిత్రం ద్వారా జాన్వీకపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ధృవీకరించింది. జాన్వీకపూర్ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను  విడుదల చేశారు. ఆమె తుఫాను వెనక దాగివున్న ప్రశాంతత వంటిది  అంటూ ఫొటోకు క్యాప్షన్‌ను  జోడించారు. ఫస్ట్‌లుక్‌లో  జాన్వీకపూర్ సంప్రదాయ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ నెలలోనే లాంఛనంగా ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉందని, తన కల నిజమైందని జాన్వీకపూర్ పేర్కొంది. అభిమానులు, ప్రేక్షకులు మెచ్చేలా అన్ని హంగులతో సినిమాను రూపొందించి ఏప్రిల్ 5 2024న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా NTR  30 చిత్రాన్ని తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో టాప్ టెక్నీ టెక్నీషియ‌న్స్‌గా  పేరున్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర ప్రసాద్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events