యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) యువరాజుగా షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నాహ్‌యాన్ (41) నియమితులయ్యారు. ఈయన యూఏఈ ప్రస్తుత అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నాహ్‌యాన్ (62) పెద్ద కుమారుడు. ఖలీద్ 2016 నుంచి దేశ ఇంటెలిజెన్స్ విభాగానికి చైర్మన్‌గా ఉన్నారు. షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఖలీద్‌కు పట్టాభిషేకం చేశారు. తన తదనంతరం ఖలీద్ యూఏఈ అధ్యక్షుడు కానున్నట్లు ఆయన ప్రకటించారు.