సోగ్గాడే చిన్నినాయనా వంటి హిట్ చిత్రం తర్వాత నాగార్జున, కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం బంగార్రాజు. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా నాగచైతన్యకి జోడిగా కృతి శెట్టి కనిపిస్తారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై నాగార్జున నిర్మిస్తున్న బంగార్రాజు నుంచి కృతీ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో నాగలక్ష్మి పాత్ర చేస్తున్నారామె. లెడీస్ ఫస్ట్.. నాగలక్ష్మి పాత్రలో కృతి శెట్టి అంటూ నాగచైతన్య ట్వీట్ చేశారు. ప్రచార చిత్రంలో ఆమె ఎన్నికల్లో గెలిచినట్లుగా మెడలో దండతో జనాలకు అభివాదం చేస్తూ క్యూట్‌గా కనిపించింది. రొమాన్స్, ఎమోషన్స్‌తో పాటు అన్ని రకాల వాణిజ్యాంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, కెమెరా: యువరాజ్. త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది అని చిత్ర బృందం తెలియజేసింది. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
…………