Namaste NRI

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా పదవీ స్వీకార ప్రమాణం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శివ ప్రతాప్ శుక్లాతో ప్రమాణం చేయించారు.ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News