అమెరికాలోని కొలరాడో రాష్ట్రానికి చెందిన అత్యున్నత న్యాయస్థానం మాజీ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు షాకిచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను అనర్హుడిగా ప్రకటించింది. స్టన్నింగ్ తీర్పును ఇచ్చిన కొలరాడో సుప్రీంకోర్టు దేశ రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ తీర్పుతో కొలరాడో రాష్ట్రంలో ట్రంప్ తన రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయడానికి అనర్హుడ య్యారు. కొలరాడో కోర్టు అసాధారణ రీతిలో 4-3 తేడాతో తీర్పును వెలువరించింది. 2021, జనవరి ఆరో తేదీన జరిగిన క్యాపిటల్ హిల్ అటాక్ కేసులో కొలరాడో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అయితే జనవరి 4వ తేదీ వరకు ఆ తీర్పుపై స్టే ఇచ్చారు. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి ట్రంప్‌నకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న వ్యక్తిని న్యాయస్థానం అనర్హుడిగా ప్రకటించడం ఇదే ప్రథమం.