Namaste NRI

ప్రపంచ నవంబర్ వన్ కు షాక్..యూఎస్ ఓపెన్ విజేతగా మెద్వెదేవ్

యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో రెండో సీడ్‌ రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదేవ్‌ సంచలన విజయంతో టైటిల్‌ ను సొంతం చేసుకున్నాడు. ఈ ఫైనల్‌ పోరులో ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు, టాప్‌ సీడ్‌ సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌ను వరుస సెట్లలో ఓడిరచి మెద్వెదేవ్‌ సత్తా చాటాడు. న్యూయార్క్‌ సిటీలోని ఆర్థర్‌ ఆషే స్టేడియంలో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో మెద్వెదేవ్‌ 6-4, 6-4, 6-4,  తేడాతో జకోవిచ్‌ పై అద్భుత విజయాన్ని సాధించి మొదటిసారిగా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

                2019లో రన్నరప్‌ టైటిల్‌తో సరిపెట్టుకున్న మెద్వెదేవ్‌ ఈ సారి టైటిల్‌ ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌శ్లామ్‌ టైటిళ్లు గెలుచుకున్న  క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాలనే జకోవిచ్‌ ఆశలు అవిరాయ్యాయి. దీంతో జకోవిచ్‌ తన కలను సాకారం చేసుకునేందుకు ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. జకోవిచ్‌ ఇప్పటికే 20 గ్రాండ్‌ శ్లామ్‌ టైటిళ్లను గెలిచిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో కేవలం ఒక్కసెట్‌లో మాత్రమే ఓడిపోయి టైటిల్‌ గెలిచిన వీరుడిగా మెద్వెదేవ్‌ నిలిచాడు. మరో వైపు యూఎస్‌ ఓపెన్‌లో సింగిల్స్‌ విభాగంలో ఈసారి ఇద్దరు కొత్త ఛాంపియన్లు ఉద్భవించారు. మహిళ సింగిల్స్‌లో 18 ఏళ్ల ఎమ్మా రుదుకాను విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events