Namaste NRI

ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు షాక్‌

ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌పై రష్యా నిషేధం విధించింది.  అమెరికాకు చెందిన 29 మంది రాజకీయవేత్తలు, కంపెనీ సీఈవోలను బ్లాక్‌ లిస్టులో పెట్టింది. రష్యా నిషేధిత జాబితాలో మార్క్‌ జుకర్‌బర్గ్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు ఉన్నారు. నిరవధికంగా వారిపై బ్యాన్‌ను విధిస్తున్నట్లు రష్యా తెలిపింది. రష్యా ప్రకటించిన బ్లాక్‌లిస్టులో లింక్డిన్‌ సీఈవో ర్యాన్‌ రోస్లాన్స్కీ కూడా ఉన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లిన రష్యాపై అమెరికాతో పాటు యూరోప్‌ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా కూడా ప్రతీకార చర్యలకు దిగుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events