అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. వచ్చే ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగితే ఎవరు గెలుపొందే అవకాశం ఉందన్న దిశగా నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కంటే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పది పాయింట్లు ముందంజలో ఉన్నట్టు వెల్లడైంది. డెమొక్రాటిక్ పార్టీ నేత అయిన బైడెన్‌కు 42 శాతం మంది మద్దతు పలుకగా, రిపబ్లికన్ పార్టీ నేత అయిన ట్రంప్‌నకు 52 శాతం మంది మద్దతు లభించింది. మే నెలలో నిర్వహించిన సర్వేలో ట్రంప్‌నకు 49 శాతం, బైడెన్‌కు 43 శాతం మద్దతు కనిపించింది. వలస సంక్షోభం, ప్రభుత్వంలో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశాలు, అభిశంసనకు పిలుపులు వంటివన్నీ బైడెన్‌కు ఇబ్బందికరంగా మారాయి. పోల్‌లో పాల్గొన్నవారిలో 75 శాతం మంది తాము బైడెన్ (80) వయసు పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. ట్రంప్-బైడెన్ ముఖాముఖిలో 51-42 నిష్పత్తిలో ట్రంప్‌నకే మద్దతుగా ఫలితాలు వచ్చాయి. తన తోటి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకంటే కూడా మాజీ అధ్యక్షుడు చాలా ముందంజలో ఉన్నారుఅని సర్వే స్పష్టం చేసింది.