Skip to main content

Namaste NRI

రామ్ పోతినేని హీరోగా నూతన చిత్రం.. షూటింగ్ ప్రారంభం

తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతూ హీరో రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం ఘనంగా ప్రారంభమైంది. రామ్‌ 23వ సినిమా ఇది. రాపో సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి పి. మురళీమోహన్‌ కెమెరా స్విఛాన్‌ చేయగా, పీవి రవికిషోర్‌ క్లాప్‌నిచ్చారు. తొలి సన్నివేశానికి హీరో రామ్‌ స్వయంగా దర్శకత్వం వహించారు.

నియో-నోయర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమా ఇదని, యాక్షన్‌ అంశాలు అబ్బురపరుస్తాయని, సోమవారమే రెగ్యులర్‌ షూటింగ్‌ను కూడా మొదలుపెట్టామని చిత్రబృందం పేర్కొన్నది. రామ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తిరునావుక్కరసు, స్టంట్స్‌: పీటర్‌ హెయిన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, నిర్మాత: కృష్ణ పోతినేని, రచన-దర్శకత్వం: రామ్‌ పోతినేని.

Social Share Spread Message

Latest News