Skip to main content

Namaste NRI

జర్మనీలో కాల్పులు కలకలం

జర్మనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తర జర్మనీలోని స్టేడ్ పట్టణంలో జరిగిన మాస్ షూటింగ్‌ లో ఐదుగురు మరణించారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులతో సంబంధమున్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మాస్ షూటింగ్‌కు కారణాలపై ఈ ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. స్టేడ్ పట్టణంలోని యువ కేంద్రం సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సిటీ మధ్యలో ఉండే ఈ ప్రాంతంలో ఈమధ్య పెద్ద సంఖ్యలో కార్యకలాపాలు సాగుతున్నాయి. దాంతో, తుపాకులతో వచ్చిన కొందరు అక్కడి వారిపై కాల్పులు జరిపారు. ఒక్కసారిగా కాల్పుల మోతతో జనాలు భయభ్రాంతులకు లోనయ్యారు.

బుల్లెట్ గాయాలతో ఐదుగురు చనిపోయారని ఓ పోలీసు అధికారి చెప్పారు. సమాచారం అందగానే అక్కడి వెళ్లిన పోలీసులు, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయండి. మీ ప్రాణాలు కాపాడుకోండి అని అక్కడి వారిని ఆదేశించినట్టు పోలీస్ అధికారి వెల్లడించారు.

Social Share Spread Message

Latest News