అమెరికాలోని వాషింగ్టన్ లీస్ట్రీట్ వీధిలోని ఐడియా పబ్లిక్ చార్టర్ స్కూల్ బ్లాక్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. 15 ఏళ్ల యువకుడు ఆ స్కూల్‌లోని ఇద్దరు విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సదరు నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడిరచారు. అంతేకాదు ఆ స్కూల్లో ఉన్న దాదాపు 350 మంది విద్యార్థులను స్కూల్ సిబ్బందిని ఈ విషయమై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
