Skip to main content

Namaste NRI

సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో శ్రద్ధాదాస్ థ్రిల్లర్ త్రికాల

సనాతన ధర్మంలో దాగివున్న రహస్యాల ఆధారంగా రూపొందిన మైథలాజికల్‌ ఫిక్షనల్‌ థ్రిల్లర్‌ త్రికాల. శ్రద్ధాదాస్‌ ప్రధాన పాత్రధారి. మణి తెల్లగూటి దర్శకుడు. రాధిక, శ్రీనివాస్‌ నిర్మాతలు. ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయని, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందిందని, సంస్కృతి, ఆధ్యాత్మికత, థ్రిల్‌ అంశాల కలబోత ఈ సినిమా అని మేకర్స్‌ చెబుతున్నారు.మాస్టర్‌ మహేంద్రన్‌, అజయ్‌, ఆమని, సాహితి అవంచ, ప్రభాకర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది.ఈ చిత్రానికి కెమెరా: పవన్‌ చెన్న, సంగీతం: హర్షవర్దన్‌ రామేశ్వర్‌, సమర్పణ: చాగంటి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పీ.

Social Share Spread Message

Latest News