నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రంలో హీరోయిన్గా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఎన్బీకే 107 అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పైకి వెళ్లనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించే చిత్రంలో బాలయ్య, శ్రుతిహాసన్ జోడీ కట్టనున్నారు. క్రాక్ సినిమా విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న గోపీచంద్ అద్భుతమైన కథతో బాలకృష్ణ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రుతిహాసన్ సీనియర్ హీరో బాలకృష్ణతో నటించడం ఇదే ప్రధమం కావడంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి కలుగుతోంది. కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని చిత్ర నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ వెల్లడిరచారు. ఈ సినిమా కోసం జై బాలయ్య అనే టైటిల్‌తో పాటు పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.