టాలీవుడ్ యాక్టర్ అడివి శేష్ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఓ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. షనియల్ డియో దర్శకుడు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌ను డిసెంబర్ 18న అనౌన్స్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇక ఈ పోస్టర్లో శృతి హాసన్ ఉండగా ఆమె కోపంగా ఉండడానికి అతడి ఫైర్ కారణం అని పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.