ప్రపంచంలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో స్ఫూర్తిని, విశ్వాసాన్ని నింపడానికి లండన్ వేదికగా ప్రతి యేటా మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివవర్స్ పోటీలు జరుపుతారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఆన్‌లైన్ వేదికగా ఈ నెల మొదట్లో పోటీలు జరిపారు. ప్రపంచ నలుమూలల నుండి పాల్గొన్న ట్రాన్స్ ఉమెన్‌లలో శ్రుతి సితార మొదటి ఫ్లేస్‌లో నిలిచి, కిరీటాన్ని దక్కించుకుంది. మొదటి ఇద్దరు రన్నరప్‌లుగా నిలిచినవారిలో వరుసగా ఫిలిప్పీన్స్ కెడానకు చెందిన వారు ఉన్నారు.
కేరళలో ఉంటున్న శ్రుతి సితార ఫస్ట్ ఇండియన్ మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్స్ 2021 టైటిల్‌ను గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ పట్ల ఉన్న సంకుచిత మనస్తత్వాలను మార్చేందుకు ఏళ్లుగా చేసిన పోరాటం వల్ల ఈ కిరీటాన్ని దక్కించుకున్నాను అని ఆనందంగా చెబుతుంది శ్రుతి సితార.