
ప్రముఖ నటి సమంత నిర్మాతగా తీసిన చిత్రం శుభం. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. హర్షిత్‌రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ ఇందులో ప్రధాన పాత్రధారులు. మే 9న విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు. సెన్సిబుల్ హ్యూమర్‌తో ఈ సినిమా అందర్నీ పాత కాలానికి తీసుకెళ్తుందని, ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. సమంత మాట్లాడుతూ వినోదాన్ని అందించడమే లక్ష్యంగా మా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ముందుకెళ్తుంది. ఆ కోవలో మేం చేసిన తొలి ప్రయత్నమే శుభం అన్నారు.
