Namaste NRI

నరేష్‌ అగస్త్యతో జతకట్టిన శ్వేత అవస్తి

నరేష్‌ అగస్త్య హీరోగా వీరభద్రమ్‌ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం శ్వేత అవస్తిని కథానాయికగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. విభిన్నమైన క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఈ నెలలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది అని నిర్మాతలు తెలిపారు. మొదటి షెడ్యూల్‌లో శ్వేత జాయిన్‌ కానున్నారు. ఈ చిత్రంలో మరి కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డెక్కన్‌ డ్రీమ్‌ వర్క్స్‌, జయదుర్గాదేవి మల్టీమీడియా బ్యానర్లపై నబీ షేక్‌, తూము నర్సింహా పటేల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events