చండీఘడ్‌కు చెందిన శ్వేతా శారద మిస్ దివా యూనివర్స్ 2023 టైటిల్‌ను గెలచుకున్నది. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో ఆమె విజేతగా తేలింది. గత ఏడాది చాంపియన్ దివితా రాయ్.. శ్వేతా శారదకు అందాల కిరీటాన్ని తొడిగారు. దివా యూనివర్స్ అందాల కిరీటాన్ని తన ఖాతాలో వేసుకున్న శారద, ఈ ఏడాది ఇండియా తరపున 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొననున్నది. శ్వేతా శారద పుట్టింది చండీఘడ్‌లో. 16 ఏళ్ల వయసులో ఆమె ముంబైకి వెళ్లింది. 22 ఏళ్ల ఆ బ్యూటీ భామ ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోల్లో పాల్గొన్నది. డీఐడీ, డాన్స్ దీవానే, డాన్స్ పస్ల్ లాంటి ప్రోగ్రామ్‌లు చేసింది. జలక్ దిక్లాజా షోకు కొరియాగ్రాఫర్‌గా చేసిందామె. శ్వేతా శారదను ఆమె తల్లి ఒంటరిగా పెంచి పోషించింది. తల్లే తనకు ప్రేరణ అని పలు సందర్భాల్లో శ్వేతా తెలిపింది. బాలీవుడ్ యాక్టర్ శంతను మహేశ్వరి తో కలిసి నటించింది. ఇక ఈ ఏడాది మిస్ దివా సుప్రానేషనల్ టైటిల్‌ను సోనాల్ కుక్రేజా గెలుచుకున్నది. కర్నాటకకు చెందిన త్రిషా శెట్టి, మిస్ దివా 2023 రన్నరప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నది.
