Namaste NRI

సిద్ధార్థ్ రాయ్ నవతరం ప్రేమకథ పోస్టర్, ఫస్ట్ లుక్

దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా సిద్ధార్థ్ రాయ్. తన్వి నేగి నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మాతలు. వి యశస్వి దర్శకత్వం వహిస్తున్నారు. నాదిని, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ను  దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వి యశస్వి మాట్లాడుతూ కొత్త తరం ప్రేమకథ ఇది. హైదరాబాద్, విశాఖలో చిత్రీకరణ పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేసవిలో మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం  అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, సంగీతం: రధన్, కోరైటర్స్: మహమ్మద్ అన్వర్, లూదీర్ బైరెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events