Namaste NRI

ప్రతిపక్షాల గొంతు నొక్కడం సబబు కాదు : ఆకుల శ్యామ్‌

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ స్పీకర్‌గా కాకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిలా వ్యవహరిస్తుండటం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ డెన్మార్క్ అధ్యక్షుడు శ్యామ్ ఆకుల విమర్శించారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ స్పీకర్‌ నిష్పక్షపాత బాధ్యతలను తుంగలో తొక్కారని అన్నారు. సభలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాపాడడమే లక్ష్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల గొంతును అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. స్పీకర్ పదవి పార్టీ భిక్ష కాదు,అది రాజ్యాంగబద్ధమైన గౌరవప్రదమైన పదవి అన్నారు. కానీ ప్రస్తుత స్పీకర్ కాంగ్రెస్ నాయకుడిలా ప్రవర్తిస్తూ, శాసనసభను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events