Namaste NRI

ఫీల్ గుడ్ కథతో సీతా కళ్యాణ వైభోగమే.. రిలీజ్ డేట్ ఫిక్స్

సుమన్‌తేజ్‌, గరీమ చౌహాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం సీతా కల్యాణ వైభోగమే. సతీష్‌ పరమవేద దర్శకత్వం. రాచాల యుగంధర్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కొత్త లుక్‌ను విడుదల చేశారు. అందమైన ప్రేమకథా చిత్రమిది. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో పాటు యాక్షన్‌ హంగులతో తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వినూత్న ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: పరశురామ్‌, సంగీతం: చరణ్‌ అర్జున్‌, దర్శకుడు: సతీష్‌ పరమవేద.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress