Skip to main content

Namaste NRI

యూకేలోని బర్మింగ్‌హామ్ లో ఘనంగా సీతారాముల కళ్యాణం

యూకేలోని బర్మింగ్‌హామ్ లో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన రామచంద్ర మూర్తిని ఒక పల్లకిలో, సీతమ్మ వారిని మరొక పల్లకిలో ఉంచి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. స్త్రీలు ప్రత్యేకంగా నేచిన చీరలు ధరించి కోలాటాలతో స్వాగతం పలికారు. సీతారాముల పల్లకీలను ఎదురెదురుగా వుంచి అమ్మ వారి స్వామి వారి గుణ గణాలను తెలుపుతూ ఎదుర్కొలు ఉత్సవం నిర్వహించారు. ముక్కురాల సిద్ధార్థ శర్మ కల్యాణంను వేదోక్తంగా నిర్వహించారు. పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ పూజా ఘట్టాన్ని వివరించారు. కల్యాణం అనంతరం పసందైన పెళ్లి భోజనం భక్తులకు వడ్డించారు. మాడుగుల నాగఫణి శర్మ ప్రవచనాలతో భక్తులను మంత్ర ముగ్ధలను చేశారు. ఇస్కాన్ బృందం సంకీర్తనలు ఆలపించారు.

బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, లార్డ్ డిప్యూటీ లెఫ్ట్ నెంట్ సైమన్ టమ్మాన్, ఇండియన్ కౌన్సిలేట్ జనరల్ డా వేంకటాచలం విచ్చేసి కల్యాణ మహోత్సవంను వీక్షించారు. యూకే లో ఇలా సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఇది 31వ సారి అని నిర్వాహకులు తెలిపారు. అందరిలో ఆద్యాత్మికత పెంపొందించేందుకు ఈ శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. యూకే నుండి మొత్తం నాలుగు వేలకు పైగా భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events