ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ తెలంగాణ సమాజం ఆధ్వర్యంలో స్ట్రాత్పైన్ కమ్యూనిటీ హాలులో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పురోహితులు వంశీ సీతం రాజు, దుర్గ కర్ర, రామకృష్ణ బొలుసు, శ్రీకృష్ణ రావిపాటి వారిచే సీతారాముల కల్యాణం జరిపించారు. గోల్డ్ కోస్ట్ తెలుగు సంఘం వారు కూడా స్వామి కల్యాణానికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్ కల్లెం, శ్రీకాంత్ సాదం, ప్రభాకర్ బచ్చు, శివ నాగ్ పుర్కర్, కనక రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పానకం, వడపప్పు, అన్నదాన వితరణ జరిగినట్లు సెక్రటరీ కిషోర్ కత్తి ఒక ప్రకటనలో తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)