
హీరో శివకార్తికేయన్, సుధా కొంగర దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఆకాష్ భాస్కరన్ నిర్మాత. ఈ చిత్రం ప్రకటన విడుదలైంది. నిర్మాత మాట్లాడుతూ ఇది మా సంస్థ నుంచి వస్తున్న రెండో సినిమా. అలాగే శివకార్తికేయన్‌కి హీరోగా 25వ సినిమా. ఈ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌కు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్టర్ కావడంతో ఇప్పటికే సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం అని తెలిపారు. జయం రవి, అధర్వ, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి కె.చంద్రన్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: డాన్ పిక్చర్స్.
