Namaste NRI

జాతిరత్నాలు దర్శకుడితో శివకార్తికేయన్ సినిమా ప్రారంభం

తమిళ నటుడు శివకార్తికేయన్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా ప్రారంభమైంది. జాతిరత్నాలు ఫేమ్‌ అనుదీప్‌ కెవీ దర్శకత్వంలో నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, సురేష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలోని కారైకూడిలో ఘనంగా జరిగాయి. ఎంటర్టైనమెంట్‌ జర్నీ మొదలైంది. తెలుగు తమిళ ద్విభాషా చిత్రం కారైకూడిలో అధికారిక పూజా కార్యక్రమాలతో ప్రారంభించాం. రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది అంటూ మేకర్స్‌ మూవీ లాంఛింగ్‌ ఫొటోలను విడుదల చేశారు. వినూత్న కథాంశంతో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పాండిచ్చేరి, లండన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేస్తాం అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం : ఎస్‌ఎస్‌ తమన్‌, సహనిర్మాత : అరుణ్‌ విశ్వ.

……………….

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events