Skip to main content

Namaste NRI

స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌ అడల్ట్‌ కంటెంట్‌ మూవీ కాదట

సంజయ్‌రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌. మైక్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకుడు. పూర్తి కామికల్ ఎంటర్‌టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ (జూలై 21) పోస్టర్‌ను హీరో సత్య దేవ్ విడుదల చేశారు.  దర్శకుడు మట్లాడుతూ పూర్తి వినోదాత్మక చిత్రమిది. ఇందులో ఎలాంటి అడల్ట్‌ కంటెంట్‌ ఉండదు. మనుషుల కంటే జంతువులే విధేయంగా ఉంటాయి. ఈ పాయిం ట్‌ ఆధారంగా ఈ కథను తయారుచేసుకున్నా. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది అన్నారు.

ఈ సినిమాలో తాను మాస్‌ పాత్రలో కనిపిస్తానని హీరో సంజయ్‌రావు తెలిపారు. ప్రేక్షకులకు ఆద్యంతం వినోదాన్ని పంచే కంటెంట్‌తో ఈ సినిమాను రూపొందించామని మైక్‌ టీవీ సీఈవో చక్రధర్‌ పేర్కొన్నారు. నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా చాలా వినోదాత్మకంగా ఉంటుంది. కొత్త పాయింట్, కొత్త కథ ఇది అని చెప్పారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ ఈ సినిమాలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. తరువాత హీరో కోసం మా అబ్బాయిని తీసుకున్నారు అని తెలిపారు.  ఈ నెల 21న విడుదల కానుంది.  ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్‌ రెడ్డి, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, నిర్మాతలు: అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి, రచన-దర్శకత్వం: ఏఆర్‌ శ్రీధర్‌. ఈ కార్యక్రమంలో సంజయ్ రావు, ప్రణవి మానుకొండ, నిహార్ దేవెళ్ల, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events