Namaste NRI

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను

అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. ఆర్కిటిక్‌ పేలుడు సంభవించడటంతో 48 రాష్ట్రాలు చలిగుప్పిట్లో చిక్కుకున్నాయి. తూర్పు అమెరికాలో పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. న్యూయార్క్‌లో పరిస్థితి యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నదని గవర్నర్‌ క్యాథీ హోచుల్‌ అన్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనాలు వెళ్లడానికి వీల్లేకుండా పోయిందని చెప్పారు. ఇక బఫెలో లోని కొన్ని ప్రాంతాలలో 2.4 అడుగుల మేర మంచు కురిసిందని, విద్యుత్‌ లేకపోవడంతో ప్రజలు ప్రమాదంలో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. తుఫాను పరిస్థితుల్లో ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు కోరుతున్నారు. భారీ మంచు తుఫాను వల్ల న్యూర్క్‌ ఒక వార్‌ జోన్‌ను తలపిస్తున్నది. గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. విపరీతమైన చల్లని గాలులు వీస్తుండటంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31 మంది మృతిచెందారు. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో 20 లక్షల మందికి పైగా అంధకారంలో చిక్కుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events