Namaste NRI

ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో.. సినిమా రాలేదు

సుధీర్‌బాబు  కథానాయకుడిగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం హరోం హర. సుమంత్‌ జి నాయుడు నిర్మాత. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువ హీరోలు విశ్వక్‌ సేన్‌, అడివి శేష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మట్లాడుతూ నీ టార్గెట్‌ టెన్‌మైల్స్‌ అయితే ఏమ్‌ ఫర్‌ ది లెవంత్‌ మైల్‌ అని మహేష్‌బాబు సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. కానీ నేను ట్వెల్త్‌ మైల్‌కి గురిపెట్టాను. ఓ వినూత్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాను అన్నారు. ఇప్పటివరకు ఇలాంటి బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా రాలేదని, ప్రతీ షాట్‌, ఫ్రేమ్‌ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకొని అత్యుత్తమ సాంకేతికతతో తెరకెక్కించామని, ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుందని తెలిపారు.

తప్పకుండా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే సినిమా అవుతుందని, ఈ చిత్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంకితమిస్తున్నానని దర్శకుడు జ్ఞానసాగ్‌ ద్వారక పేర్కొన్నారు. ఈ కథలో తండ్రీకొడుకుల ఎమోషన్‌ ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని నిర్మాత సుమంత్‌ జి నాయుడు తెలిపారు. ఇంకా యూనిట్‌ సభ్యులందరూ మాట్లాడారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events