బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ బండి సంజయ్ పై టాక్ లండన్ ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా శుష్మణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో హుందాగా విమర్శలు చేయాలి కానీ ఇలా మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన కవిత ఆడబిడ్డలందరి ప్రతిరూపమని వారిని కించపరిస్తే ఆడబిడ్డలెక్కడున్నా తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను ఎన్ఆర్ఐ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఎమ్మెల్సీ కవితకు తక్షణమే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని శుష్మణ డిమాండ్ చేశారు.














