ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సలార్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తయింది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో లేదా జూన్ ఆరంభంలో రిలీజ్ చేయనున్నట్లుగా ఈ చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ పేర్కొన్నారు. సలార్ షూటింగ్ 30 శాతం పూర్తయింది. మిగతా షూటింగ్ జరిపేందుకు చాలా సమయం కావాల్సి ఉందని తెలుస్తున్నది. నెక్ట్స్ షెడ్యూల్ మే స్టార్టింగ్లో ఉండొచ్చు. సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, ప్రచార సమయం కలుపుకొంటే మరో ఐదారు నెలలు పడుతుంది. దీంతో వచ్చే ఏడాది వేసవికే ప్రభాస్ ప్రేక్షకులను పలకరించే అవకాశముంది. అయితే సలార్ రెండు భాగాలుగా రాబోతుందా? అనే విషయంపై మాత్రం ఆయన సరైన స్పష్టత ఇవ్వలేదు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సలార్ చిత్రంలో జగపతిబాబు ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)